TG-5161
Telugu

నా జీవం నా సర్వం నీవే దేవా

Naa Jeevan Naa Sarvan Neevee Deevaa

0
views
పల్లవి

- Scale : Em నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||జీవం||

1వ చరణం

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును ||జీవం||

2వ చరణం

మరణము జయించి తిరిగి లేచితివి నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి అపురూప ప్రేమకై నీ సాక్షినై నిలిచెదన్ బుధిగంతము వరకు నే ప్రకటించెదన్ నీవే నీవే నీవే దేవా (4)