TG-214
Telugu

రండు విశ్వాసులారా రండు విజయము

randu vishvaasulaaraa randu vijayamu

205
views
పల్లవి

రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు సంతోషంబును గల్గి మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు నియమించె దేవుఁడు విజయం, విజయం, విజయం, విజయం ||రండు విశ్వాసులారా||

1వ చరణం

నేటి సమయ మన్ని యాత్మలకును నీ టగు వసంత ఋతువగును వాటముగఁ జెరసాలను గెలిచె వరుసగ మూన్నాళ్ నిద్రించి సూటిగ లేచెన్ యేసు సూర్యుని వలెన్ ||రండు విశ్వాసులారా||

2వ చరణం

కన్ను కన్నుకానని చీఁకటి కాలము క్రీస్తుని కాంతిచే నిన్నాళ్లకు శీఘ్రముగఁ బోవు చున్నది శ్రీ యేసుని కెన్నాళ్ల కాగని మన సన్నుతుల్ భువిన్ ||రండు విశ్వాసులారా||

3వ చరణం

బలమగు మరణ ద్వారబంధ ములు నిన్ బట్టకపోయెను వెలుతురు లేని సమాధి గుమ్మ ములు నిన్నాపక పోయెను గెలువ వాయెను కా వలియు ముద్రయు ||రండు విశ్వాసులారా||

4వ చరణం

పన్నిద్దరిలోపల నీ వేళ సన్నుతముగ నీవు నిలిచి యున్నావు మానవుల తెలివి కెన్నఁడైన నందని యౌన్నత్య శాంతిని న నుగ్రహింతువు ||రండు విశ్వాసులారా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.