TG-5139
Telugu

నా కలవరములన్ని కనుమరుగు చేసినావు

Naa Kalavaramulanni Kanumarugu Cheesinaavu

0
views
పల్లవి

నా కలవరములన్ని కనుమరుగు చేసినావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

1వ చరణం

నీ చేయి నన్ను సంరక్షించెను నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

2వ చరణం

యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

3వ చరణం

బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||

4వ చరణం

నిన్ను నమ్మువారు సీయోనులో చేరి నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము||