TG-339
Telugu

ఎంత పాపి నైనను యేసు

entha paapi nainanu yeesu

202
views
పల్లవి

ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంతటఁ జాటించుఁడి ||ఎంత పాపి||

1వ చరణం

మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైనఁ దా నిచ్చి చేర్చుకొనును. ||ఎంత పాపి||

2వ చరణం

తన దివ్య సిల్వచేఁ దీసి పాప శాపమున్ నన్ బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను ||ఎంత పాపి||

3వ చరణం

ఘోర పాపి నైనను నన్ను ఁ జేర్చుకొనును పూర్ణశుద్ధి నిచ్చును స్వర్గమందుఁ జేర్చును ||ఎంత పాపి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.