♪♫
TG-3750
Telugu
నా కృప నీకు చాలని
Naa Krupa Neeku Chaalani
0
views
పల్లవి
నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప||
1వ చరణం
నేను నీకు తోడైయున్నానని పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2) నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2) పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో||
2వ చరణం
పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2) నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2) జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2) ||నాతో||