♪♫
TG-3775
Telugu
నా స్తుతి పాత్రుడా
Naa Sthuthi Paathrudaa
0
views
పల్లవి
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2) నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా||
1వ చరణం
నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2) నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా||
2వ చరణం
నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2) నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి పాత్రుడా||