సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు
sarva chiththanbu needeenayyaa svaruupamichchu
సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2) సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు||
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వ శక్తుండవే నీ చేత పట్టి నన్ రక్షింపుమా ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమున అధికంబుగా నన్ నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.