TG-2955
Telugu

నన్నెంతగానో కోరావుగా

nannentagaanoo kooraavugaa

Pranam Kamlakarబ్రో. జాషువా షేక్ · Bro. Joshua Shaikబ్రో. ఆనంద్ · Bro. Anand
1
views
Chorus

నన్నెంతగానో నీవు కోరావుగా బ్రతుకంత నాకు తోడై ఉన్నావుగా రచించావు నన్ను నీవు క్షమించావు నన్ను నీవు నీ ప్రేమ చాలు నాకు నా యేసయ్య

1వ చరణం

ఏముంది ఈ జగాన - ఎదురీత సాగరాన   నా జీవ నావ నీవే నా యేసయ్య తీరాలే దూరమైన - కనుమేర చీకటైన ఏ భయము లేదు నాకు నీవుండగా అలజడులే రేగినా - అధికారం నీదనీ  అనుదినము నీ కృపా  - స్తుతియించి పాడనీ  ప్రియమైన యేసయ్య - నడిపించు నన్నిలా

2వ చరణం

ఊహించలేను దేవ నీవు లేని జీవితాన్ని   ఓ నిమిషమైన నేను మనలేనుగా  నాలోని ఆశ నీవే - ఎదలోని ధ్యాస నీవే నీ పాదసేవకేగ ఈ జీవితం ఆణువణువు నీవనీ- ఇహమందు పాడనీ  కడవరకు సాక్షిగా - కలకాలం సాగనీ  ప్రియమైన యేసయ్య - కరుణించు నన్నిలా