ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి
ishraayeeleeyula deevundee yenthoo sthuthi
ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె ||ఇశ్రాయేలీయుల దేవుండే||
తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె ||ఇశ్రాయేలీయుల దేవుండే||
దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె ||ఇశ్రాయేలీయుల దేవుండే||
జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ ||ఇశ్రాయేలీయుల దేవుండే||
ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె ||ఇశ్రాయేలీయుల దేవుండే||
ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద ||ఇశ్రాయేలీయుల దేవుండే||
మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి ||ఇశ్రాయేలీయుల దేవుండే||
మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె ||ఇశ్రాయేలీయుల దేవుండే||
జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్ ||ఇశ్రాయేలీయుల దేవుండే||