♪♫
TG-1291
Telugu
హోసన్నాయనుచు స్తుతి పాడుచు సీయోనుకు చేరెదం
hoosannaayanuchu sthuthi paaduchu seeyoonuku cheeredam
238
views
పల్లవి
హోసన్నాయనుచు స్తుతి పాడుచు సీయోనుకు చేరెదం హోసన్నా... హోసన్నా...
1వ చరణం
ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం ||హోసన్నా||
2వ చరణం
మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము|| హోసన్నా||
3వ చరణం
ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యమానందం ||హోసన్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.