క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన దినము
krismas shubhadinam mahoonnathamaina dinamu
🎵 TG-1559🌐 Telugu
పల్లవి
క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన దినము ప్రకాశమైన దినము నా యేసు జన్మ దినము (2) హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ వీ విష్ యు మెర్రి క్రిస్మస్ దావీదు వేరు చిగురు వికసించె నేడు భూమిపై అద్వితీయ కుమారునిగా లోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ||
1వ చరణం
కన్నుల పండుగగా మారెను నా యేసు జన్మదినం కన్య మరియకు జన్మించెను కలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ||
2వ చరణం
ఆనందముతో ఆహ్వానించండి క్రీస్తుని మీ హృదయములోకి ఆ తారగా మీరుండి నశించు వారిని రక్షించాలి