♪♫
TG-1556
Telugu
యెహోవాయే నా కాపరిగా నాకేమి
yehoovaayee naa kaaparigaa naakeemi
69
views
పల్లవి
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును శాంతికరమైన జలములలో నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే||
1వ చరణం
గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును నా తోడైయుండి నడిపించును నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి నా తల నూనెతో నంటియుంటివి నా గిన్నె నిండి పొర్లుచున్నది నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును నీ మందిరములో నే చిరకాలము నివాసము చేయ నాశింతును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.