TG-3862
Telugu

నీ ధనము నీ ఘనము

Nee Dhanamu Nee Ghanamu

0
views
పల్లవి

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము||

1వ చరణం

ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా (2) పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము||

2వ చరణం

పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా (2) వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము||

3వ చరణం

వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2) వెలిగించ ధర పైని ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము||

4వ చరణం

కలిగించె సకలంబు సమృద్దిగా తొలగించె పలుభాధ భరితంబులు (2) బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము||