♪♫
TG-3892
Telugu
నీ ప్రేమా నీ కరుణా
Nee Premaa Nee Karunaa
0
views
పల్లవి
నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన చాలయ్య చాలీ దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) గురిలేని నన్ను గుర్తించినావే ఎనలేని ప్రేమను చూపించినావే వెలలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా||
1వ చరణం
చేజారిన నాకై చేచాచినావే చెదరిన నా బ్రతుకును చేరదీసినావే చెరనుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే ||నీ ప్రేమా||
2వ చరణం
నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే నీ కుమారునిగా నను మార్చినావే ||నీ ప్రేమా||