♪♫
TG-4668
Telugu
ఉదయమాయె హృదయమా ప్రభు యేసుని ప్రార్ధించవే
Udayamaaye Hrudayamaa Prabhu Yeesuni Praardhinchavee
19
views
పల్లవి
ఉదయమాయె హృదయమా ప్రభు యేసుని ప్రార్ధించవే (2) పదిలముగా నిను వదలకుండా పడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె||
1వ చరణం
రాత్రి గడచిపోయెనే రవి తూర్పున తెలవారెనే (2) రాజా రక్షకుడేసు దేవుని మహిమతో వివరించవే (2) ||ఉదయమాయె||
2వ చరణం
తొలుత పక్షులు లేచెనే తమ గూటి నుండి స్తుతించెనే (2) తండ్రి నీవే దిక్కు మాకని ఆకాశమునకు ఎగిరెనే (2) ||ఉదయమాయె||
3వ చరణం
పరిశుద్ధుడా పావనుండా పరంధాముడా చిరంజీవుడా (2) పగటియంతయు కాచి మము పరిపాలించుము దేవుడా (2) ||ఉదయమాయె||
4వ చరణం
తండ్రి దాతవు నీవని ధరయందు దిక్కు ఎవరని (2) రాక వరకు కరుణ చూపి కనికరించి బ్రోవుమా (2) ||ఉదయమాయె||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.