TG-4670
Telugu

ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు

Udayinchinaandu Kreesthundu Neendu

0
views
పల్లవి

ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయౌ మరియ నందనుఁడై యిమ్మానుయేల్ సదయుఁడై చెడియున్న పృథివికి నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగను సాధు జనముల హృదయముల ముద మెదుగునట్లుగ ||ఉదయించి||

1వ చరణం

1.  ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుఁడును దా నొక్కఁడు చిర జీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు నొడఁబడి ||ఉదయించి||

2వ చరణం

2.  యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మీదుఁ జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డౌ దయాళుఁడు ప్రాణ మీడుటకు ||ఉదయించి||