TG-3894
Telugu

నీ ప్రేమకు సాటి లేదయా

Nee Premaku Saati Ledayaa

0
views
పల్లవి

నీ ప్రేమకు సాటి లేదయా యేసయ్యా… నీ సన్నిధి నాకు మేలయ్యా (2) నా కొరకై ప్రాణమిచ్చితివి నా కొరకై సిలువనెక్కితివి (2) కరుణించి కాపాడుమా నా యేసయ్యా కన్నీటి ప్రార్దన ఆలకించుమా (2) ||నీ ప్రేమకు||

1వ చరణం

అవిశ్వాసురాలై నేనుండగా అంధకారమందు రక్షించితివే నా దీనస్థితిలో నా దరికి చేరి నీ వాక్యముతో బలపరచితివే (2) మనోహరమైన నీ కృపనిచ్చి నన్నాదరించితివే (2) నా బ్రతుకు దినములన్ని నిను వేడెదన్ నా యేసయ్యా (2) నా యేసయ్యా…. ||నీ ప్రేమకు||

2వ చరణం

ఏమివ్వగలను నీ ప్రేమకు నా సర్వము నీవేనయా నా అతిశయము ఆధారము నాకన్నియు నీవేనయా (2) విశ్వాసముతో నీటిపైన నన్ను నడువనిమ్ము (2) నా అడుగులు తడబడగా నన్నెత్తుకో నా యేసయ్యా (2) నా యేసయ్యా…. ||నీ ప్రేమకు||