TG-3760
Telugu

నా ప్రాణమా ఏలనే

Naa Praanamaa Aelane

0
views
పల్లవి

నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2) నెమరేసుకుంటూ ప్రాణమా స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా||

1వ చరణం

నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2) నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా నీవు కూడా తన కార్యం పాటించుమా (2) అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా మరువకు సుమా – మరువకు సుమా ||నా ప్రాణమా||

2వ చరణం

నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2) నా ప్రాణమా నాలో కరిగిపోకే నీ గతం ఏమిటో మరచిపోకే (2) దినమెల్ల దేవుని దయ కోరుమా దయ కోరుమా – దయ కోరుమా ||నా ప్రాణమా||

3వ చరణం

నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2) నా ప్రాణమా నాలో కృంగిపోకే నీ గతం ఏమిటో మరచిపోకే (2) దినమెల్ల దేవుని కృప కోరుమా కృప కోరుమా – కృప కోరుమా ||నా ప్రాణమా||