TG-3763
Telugu

నా ప్రాణమా నాలో నీవు

Naa Praanamaa Naalo Neevu

0
views
పల్లవి

నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా||

1వ చరణం

ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ (2) నీ కొరకే బలియైన యేసు సిలువను గూర్చి తలపోయుమా (2) అల్పకాల శ్రమల పిదప మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

2వ చరణం

ఆప్తులంతా నిను వీడిననూ శత్రువులే నీపై లేచిననూ (2) తల్లి అయినా మరచినా మరచున్ నేను నిన్ను మరువాననినా (2) యేసుని ప్రేమన్ తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

3వ చరణం

ఐశ్వర్యమే లేకున్ననూ సౌఖ్య జీవితమే కరువైననూ (2) ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చిననూ (2) క్రీస్తునికే అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||