♪♫
TG-5350
Telugu
నే యేసుని వెంబడింతునని నేడేగా
Nee Yeesuni Venbadinthunani Needeegaa
0
views
పల్లవి
నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని||
1వ చరణం
నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టు విరోధుల్ నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ నాకిలలో గానిపించరని ||నే యేసుని||
2వ చరణం
కరువులైనను కలతలైనను కలసిరాని కలిమి లేములు కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము ||నే యేసుని||
3వ చరణం
శ్రమయైననూ బాధలైననూ హింసయైన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమనుండి నను యెడబాపెటి వారెవరు ||నే యేసుని||