TG-1440
Telugu

ఈ జీవితం విలువైనది నరులారా

ee jeevitham viluvainadi narulaaraa

63
views
పల్లవి

ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం||

1వ చరణం

సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు పోతున్నవారిని నువు చుచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ||

2వ చరణం

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు స్మశానానికి పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.