TG-3980
Telugu

నేను పిలిస్తే పరుగున

Nenu Pilisthe Paruguna

0
views
పల్లవి

నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

1వ చరణం

నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు అల కరుణతో నన్ను నడిపిస్తారు (2) శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

2వ చరణం

నన్ను వెంబడించమని యేసు పిలిచారు తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2) కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||