♪♫
TG-4897
Telugu
గౌరవనీయుడా గలిలయవాడా యేసయ్య నిన్ను ఘనపరచెదనయ్యా
Gauravaneeyudaa Galilayavaadaa Yeesayya Ninnu Ghanaparachedanayyaa
16
views
పల్లవి
గౌరవనీయుడా గలిలయవాడా యేసయ్య నిన్ను ఘనపరచెదనయ్యా (2) గీతము రాసి రాగము కూర్చి గానము చేసి నిన్ను స్తుతించి (2) ఆశ తీర ఆరాధింతునయా నా యేసయ్యా ఆత్మలో ఆనందింతునయా ||గౌరవనీయుడా||
1వ చరణం
ఎంచి చూస్తే ఏ మంచి లేదు నాలో తుంచి వేయాలనే వంచనతో (2) సాతాను నా వైపు ముంచుకొని రాగా కంచె వేసి నాపై కరుణ చూపినావు (2) ||ఆశ తీర||
2వ చరణం
పచ్చి మాంసం తినే సింహం కాకి మత్స్యము నీ మాట చొనెరవేర్చాయి (2) పితరుల మీద నీ ప్రేమ నిలిపి వారిని సహితము పదిలపరచినావు (2) ||ఆశ తీర||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.