♪♫
TG-4026
Telugu
ఓ క్రైస్తవ యువకా
O Kraisthava Yuvakaa
0
views
పల్లవి
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2) నీ బ్రతుకంతా మారుటే మేలు కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ||
1వ చరణం
పాపపు చీకటి బ్రతుకేలా శాపము భారము నీకేలా (2) పావన యేసుని పాదము చేరిన జీవము నీదగురా ||ఓ క్రైస్తవ||
2వ చరణం
మారిన జీవిత తీరులలో మానక నీప్రభు సేవకురా (2) మహిమ కిరీటము మనకొసగును ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ||
3వ చరణం
భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా (2) బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||