పాడెద దేవా – నీ కృపలన్
Paadeda Devaa Nee Krupalan
పాడెద దేవా – నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2) భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి (2) ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద||
ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి (2) ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2) ||పాడెద||
పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి (2) అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2) ||పాడెద||
దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి (2) చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి – చెర నను విడిపించితివి (2) ||పాడెద||
ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి (2) సత్యస్వరూప నిత్యనివాసి సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి (2) ||పాడెద||
అన్యుడనై నిను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి (2) ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి (2) ||పాడెద||