TG-4131
Telugu

పండగొచ్చింది క్రిస్మస్ పండగొచ్చింది

pandagochchindi krismas pandagochchindi

26
views
పల్లవి

పండగొచ్చింది క్రిస్మస్ పండగొచ్చింది ప్రేమ తెచ్చింది తండ్రి ప్రేమ తెచ్చింది (2)

2వ చరణం

అమ్మలార- అయ్యలార- తమ్ముళ్ళర - చెల్లెలార సంతోష గీతాలతో రారండి సంగీత గానాలతో రారండి ప్రేమ పండగలో కలసి పాడుదాం (2)

3వ చరణం

దూత చెప్పింది దేవదూత చెప్పింది, ఏమి చెప్పింది? అప్పుడేమి చెప్పింది? “రక్షకుడు మీకొరకు పుట్టాడని, ఈయనే ప్రభువైన యేసు క్రీస్తని!”

4వ చరణం

సంతోష గీతాలతో రారండి సంగీత గానాలతో రారండి

5వ చరణం

గొల్లలోచ్చారు, తూర్పు జ్ఞానులోచ్చారు, ఎందుకొచ్చారు? వారేమి తెచ్చారు?" బంగారు-సాంబ్రాణి-బోళము తెచ్చి స్తోత్ర గీతాలతో మహిమ పరిచిరి (2) ||సంతోష||

6వ చరణం

తార చూపెను, గగన తార చూపెను ఏమి చూపెను, ఆ తార  ఏమి చూపెను బేత్లహేములో బాల యేసుని లోక పాపాలు మోసే గోరెపిల్లను (3) ప్రేమ పండగలో కలసి పంచుదాం ప్రేమ పండగలో కలసి పోవుదాం (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.