TG-4125
Telugu

ప్రభువా ప్రభువా

Prabhuvaa Prabhuvaa

0
views
పల్లవి

ప్రభువా ప్రభువా కడలిని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి గనవా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్ ||ప్రభువా||

1వ చరణం

ఎదలో చెలరేగే సుడిగాలుల్లో ఎగసే ఆశ నిరాశ కెరటాలు నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించవా సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో మరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా||

2వ చరణం

దేవా నీ దయలో ధన్యుడనవ తగనా నాలో విశ్వాసం ఇంకా చాలాదనా మందలో నీ అండలో నేను ఉన్నా గొర్రెపిల్లనై దీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినో నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా||