నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది మేలు నీవు ధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి ||నీవు తోడై||
నినుఁ బోలు రక్షకుం డేడి క్రీస్తు ననుఁ బోలు పాతకుం డేడి నిను నమ్ము వారలకు నీ వొసఁగుచుందువు తనరఁ పాపక్షమ దయచేత నిలలోన ||నీవు తోడై||
నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు చుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల ||నీవు తోడై||
నీవంటి యుపకారి యేడి కర్త నావంటి కడు దీనుఁ డేడి జీవుల కును గల్గు జీవంబు లిచ్చుచు జీవాధారము లొసఁగి జీవులఁ బ్రోచెడి ||నీవు తోడై||
నీవంటి ధనవంతుఁడేడి యేసు నా వంటి ధనహీనుఁ డేడి ప్రోవులై యున్నవి యీవులు నీయందు నీవువాని నొసంగి నిరతంబు ననుఁ గావు ||నీవు తోడై||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.