TG-5448
Telugu

పరలోకమే నా స్వాస్థ్యము ఎపుడు గాంతునో

Paralookamee Naa Svaasthyamu Epudu Gaanthunoo

0
views
పల్లవి

పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1.  ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను 2.  సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును 3.  నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను 4.  పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును 5.  ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె