♪♫
TG-4036
Telugu
ఓ యేసు నీ ప్రేమ
O Yesu Nee Prema
0
views
పల్లవి
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు||
1వ చరణం
అగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు||
2వ చరణం
సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి (2) ||ఓ యేసు||
3వ చరణం
కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండునేసు (2) ||ఓ యేసు||
4వ చరణం
దేవుని గృహములో సదా స్తుతించెదనూ సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు||