TG-404
Telugu

జడియకుము నే నే యున్నానని

jadiyakumu nee nee yunnaanani

200
views
పల్లవి

జడియకుము నే నే యున్నానని కడు నెనరు వాక్కిచ్చిన యేసుని యడుగుజాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవా యిడుమ లధికము గలిగిన ప్రభుని కడకుఁ జేరరాదా ||జడియకుము నే||

1వ చరణం

ఇప్పుడు నిను బాధపరచెడి ముప్పులం దలపోసి తప్పక గొప్ప ప్రేమార్థంపు శిక్షకు నొప్పియుండరాదా నీ తప్పులన్ విడి ప్రభువు నందు మెప్పు బొందరాదా ||జడియకుము నే||

2వ చరణం

ఘనము ధనము సౌఖ్యంబు బోయి వ్యసనము శోధన మున్న యోబు మనసు దృఢము చేసి ప్రభుని మహిమ పరపలేదా నీ మనసు దృఢంబటుల జేసి మహిమ పరపరాదా ||జడియకుము నే||

3వ చరణం

బీద లాజరుండు భువిని బాధ నొందిన సాదృశ్యంపు బోధన నీ మానసమున పాదుకొనలేదా యతఁ డాదరింపఁబడిన విధము మోద మియ్యలేదా ||జడియకుము నే||

4వ చరణం

మున్ను సైఫనును రాళ్లతోఁ గొట్టు చున్న పగతుర కొరకు దేవుని మిన్ను వైపునఁ జూచి యోర్చి మన్న నడుగలేదా నీ కున్న శ్రమలటు లోర్చఁ బ్రభువు తెన్నుఁ జూపలేడా ||జడియకుము నే||

5వ చరణం

భక్త జనులను ఖైదుకు నీడ్చి బాధలు గావించినప్పుడు శక్తి హీనుల మంచు యేసుని శక్తి నమ్మలేదా యా యుక్తసహాయము దొరకువరకా సక్తి నుండలేదా ||జడియకుము నే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.