♪♫
TG-5412
Telugu
పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతోనుండా (146)
Parama Jeevamu Naaku Nivva Thirigi Leechenu Naathoonundaa (146)
0
views
పల్లవి
- ప్రకాష్ యెసుడియన్ - Scale : G 1. పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును యేసు చాలును - యేసు చాలును ఏ సమయమైన - ఏ స్థితికైనా - నా జీవితములో యేసు చాలును ||పరమ||
1వ చరణం
2. సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగివెళ్ళెదను లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను ||పరమ||
2వ చరణం
3. పచ్చిక బయలులో పరుండ జేయున్ - శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును ||పరమ||
3వ చరణం
4. నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము క్రుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడిచినను ||పరమ||