TG-3957
Telugu

నీవెన్నాళ్ళు రెండు తలంపులతో

Neevennaallu Rendu Thalampulatho

0
views
పల్లవి

నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా (2) మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా (2) మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు||

1వ చరణం

మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి (2) పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం (2) ||నీవెన్నాళ్ళు||

2వ చరణం

నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము (2) నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో (2) ||నీవెన్నాళ్ళు||