♪♫
TG-3960
Telugu
నీవు చేసిన ఉపకారములకు
Neevu Chesina Upakaaramulaku
0
views
పల్లవి
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||
1వ చరణం
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||
2వ చరణం
మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||
3వ చరణం
విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది||
4వ చరణం
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) ||ఏడాది||