TG-3955
Telugu

నీవే నీవే నన్ను పిలిచిన

Neeve Neeve Nannu Pilichina

19
views
పల్లవి

నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరము నన్ను కలిసిన వరము (2) స్తుతి గాన సంపద నిన్ను చేరాలని నా దీన మనస్సు నీవే చూడాలని ప్రయాసతో ప్రయాణమైతిని ||నీవే||

1వ చరణం

నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదు నీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2) ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథం నా కొరకే పంపావయ్యా ఏ చోటనైనా – ఏ పల్లెనైనా నీ పలుకే బంగారమాయెనయా ||నీవే||

2వ చరణం

నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యా సంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా (2) దావీదు ప్రార్ధన – ఆ యోబు వేదన కనిపెట్టి చూసావయ్యా నా దుఃఖ భారం – నా శాప భారం నీలోనే కరగాలయ్యా ||నీవే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.