పరమేదేశ మిదిగో నూతన యెరూస లేమదిగో
Parameedeesha Midigoo Noothana Yeroosa Leemadigoo
పరమేదేశ మిదిగో నూతన యెరూస లేమదిగో సోదర తిర మగు పురమది దివ్య సుందరము తరముగాదు త ద్దయు వర్ణింపగ ||బరమ||
1. ద్వాదశ రత్నములా ప్రోలుపు నాదులుగా నుండు సోదర యాదట దీరక నాణి ముత్తియ వి నోదద్వారముల నమరి వెలయు ||బరమ||
2. శుద్ధ సువర్ణమున నెంతో శుద్ధి మార్గముండు సోదర శుద్ధు లెల్ల బరి శుద్ధ గానముల శుద్ధుని నెప్పుడు స్తుతి యొనరింతురు ||బరమ||
3. పరమ జనకు సముఖం బచ్చట నరులతోడ నుండన్ సోదర నరులు దేవుని నరులై యుందురు పరమాత్ముడు దన వారలతో నుండును ||బరమ||
4. కన్నీరుండదుగా దేవుఁడు గన్నుల దుడుచునుగా సోదర యెన్నఁగ మరణం బిక నుండదు మరి చెన్నుగ భేదము శీఘ్రము దొలఁగును ||బరమ||
5. పరమపురమునందు దేవుని కిరవొకటుండదుగా సోదర పరమ జనకుడును గొఱ్ఱె పిల్లయును మురువుగ నొక మందిరమై యుందురు ||బరమ||
6. రవి చంద్రులతోడన్ నిజముగ నవసరముండదుగా సోదర యవిరతముగ యే సువె ఘనతరవై భవమై ప్రభతో బరగుచు నుండును ||బరమ||
7. సంతతంబిచ్చోట సాధులు స్తుతి సేతురు దేవున్ సోదర యతులితంబుగా హర్షమకుటమును సతతము దాల్తురు స్వామి సన్నిధిని ||బరమ||
8. ఆఁకలియుండదుగా నిజముగా నాకుల ముండదుగా సోదర ప్రాకటముగ జీ వ జలంబచ్చట నీకు నొసంగును నిరతము వరదుఁడు ||బరమ||
9. ప్రభు సన్నిధినుండి పారును శుభనది సుఖ మియ్యన్ సోదర యుభయ తీరముల నుండు తరులు సౌ రభ దీప్తిని శుభ రక్షణ ఫలమిడు ||బరమ||