TG-3577
Telugu

కొండల తట్టు నా కన్నుల

Kondala Thattu Naa Kannulu

0
views
పల్లవి

కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2) నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2) యెహోవా వలనే – యెహోవా వలనే నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2) నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2) యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా||

1వ చరణం

నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2) ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2) నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా||

2వ చరణం

వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2) నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2) నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2) ||యెహోవా||