♪♫
TG-3572
Telugu
కీర్తింతును నీ నామమ
Keerthinthunu Nee Naamamu
18
views
పల్లవి
కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా (2) మదిలో ధ్యానించి (2) తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును||
1వ చరణం
ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా (2) కల్వరిలో కృప చూపి కలుషాలు బాపిన.. నా యేసయ్యా ||కీర్తింతును||
2వ చరణం
వేనోళ్ళతోను పొగిడినా నీ ఋణము తీరునా (2) ఇన్నాళ్లు కన్నీళ్లు (2) తుడిచావు జాలితో.. నా యేసయ్యా ||కీర్తింతును||
3వ చరణం
జీవింతు నేను నీ కొరకే నీ సాక్షిగా ఇలలో (2) సేవించి పూజింతు (2) నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా ||కీర్తింతును||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.