♪♫
TG-3576
Telugu
కొండల తట్
Kondala Thattu
0
views
పల్లవి
కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల||
1వ చరణం
నీ పాదము తొట్రిల్ల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల||
2వ చరణం
ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల||
3వ చరణం
యెహోవాయే నిన్ను కాపాడును కుడి ప్రక్క నీడగా నుండును ||కొండల||
4వ చరణం
పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులకుండ కాపాడును ||కొండల||
5వ చరణం
ఎట్టి అపాయమైన రాకుండ ఆయన నీ ప్రాణము కాపాడున్ ||కొండల||
6వ చరణం
ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకలందు నిను కాపాడున్ ||కొండల||