TG-5431
Telugu

పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా

Paramuloona Baramuloonan Paapa Meemi Leedugaa

0
views
పల్లవి

పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా నరయ దానిఁ గోరు వారి కాశ యిందు లేదుగా ||పరములోన||

1వ చరణం

1.  వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు స్వామి సేవ గల్గుగా ||పరములోన||

2వ చరణం

2.  ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకుఁ గంటి నీళ్లు దుడుచుఁగా ||పరములోన||

3వ చరణం

3.  అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుఁగు వెలుగు నట్లు స్వామి సన్నిధి యుండుఁగా ||పరములోన||

4వ చరణం

4.  దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పుఁ దీర్చి క్రీస్తుఁ ఆశ్రయముగ నిల్చుఁగా ||పరములోన||

5వ చరణం

5.  అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న మిగుల ఘనుని ప్రేమ గల్గుగా ||పరములోన||