ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా

praardhana vinedi paavanudaa - praardhana maaku neerpumayaa

🎵 TG-1143🌐 Telugu
పల్లవి

ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా

1వ చరణం

శ్రేష్టమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదను - పరలోక ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన వినెడి||

2వ చరణం

పరమ దేవుడవని తెలసి - కరములెత్తి జంటగ మోడ్చి శిరమును వంచి సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన వినెడి||

3వ చరణం

దిన,దినంబు చేసిన సేవ - దైవచిత్తముకు సరిపోవ దీనుడనయ్యా దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన వినెడి||

4వ చరణం

శత్రుమూక నిను చుట్టుకొని - సిలువ పైన నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన వినెడి||

Report Error