TG-1140
Telugu

ప్రభు యేసుని నేడే స్వీకరించు

prabhu yeesuni needee sveekarinchu

208
views
పల్లవి

ప్రభు యేసుని నేడే స్వీకరించు నీ హృదయంలో అంగీకరించు (2) నీ హృదయపు భారము తొలగించు (2) నీ మదిలో నెమ్మది కలిగించు (2) ||ప్రభు|| 1 ఈ తరుణము విడువక త్వరపడుము ఈ కరుణను వదలక రారమ్ము (2) ఆరిక్తుడై నిను రక్షించుటకై (2) తన రక్తము కార్చెను వీక్షించు (2) ||ప్రభు|| 2 నీ వెంతటి పాపములో నున్న నీ అంతము నరకముగా నున్న (2) ప్రభు చెంతకు చేరుము ఈరోజే (2) నిను వింతగా మార్చును రారాజు (2) ||ప్రభు|| 3 నీ పాపము బాపగ ప్రభు వచ్చెను నీ శాపముతీర్చగ బలియయ్యెను (2) విలువైన ఆపిలుపును త్రోయుటచే (2) కలుషాత్ముడ నరకము నీదగును (2) ||ప్రభు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.