ప్రభు యేసు నిను పిలువగా - నీవు పరుగిడెదవా నిలువక

prabhu yeesu ninu piluvagaa - neevu parugidedavaa niluvaka

🎵 TG-1139🌐 Telugu
పల్లవి

ప్రభు యేసు నిను పిలువగా - నీవు పరుగిడెదవా నిలువక (2)

1వ చరణం

బంగారు మేడలున్నా - బహు ధనధాన్యాదులున్నను (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ.. ||ప్రభు యేసు||

2వ చరణం

పాప భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ.. ||ప్రభు యేసు||

3వ చరణం

నీధనము హెచ్చినను - నీ తనువు కాల్చుకున్నను (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ.. ||ప్రభు యేసు||

4వ చరణం

ప్రవచించి ప్రార్ధించినా - పలు భాషలతో ప్రకటించినా… (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ ||ప్రభు యేసు||

Report Error