TG-5469
Telugu

పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై

Parishuddhaathmaa Paavuramaa Nee Daasulapai

0
views
పల్లవి

పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదెంచుమా పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి యా దరణకర్తగ నిన్ను దయచేసె గద మాకు ||పరి||

1వ చరణం

1.  తండ్రి కుమారాత్మల యేకాత్మవై యుండిన పావనుడా నిండార నీ యాత్మ నండగ మాకొసగి దండిగ వరముల దయచేయు మోదేవ ||పరి||

2వ చరణం

2.  విధిగ వేదము జదివిన వేమారుసద్బోధల నాలించినా సదయుడ నీ శక్తి హృదయాల లేకున్న కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి ||పరి||

3వ చరణం

3.  సత్యస్వరూపా రమ్ము మమ్ముల సర్వ సత్యములో నడుపుము సత్యాత్మా నీ శక్తి సంపత్తితో దైవ కృత్యము లొనరింప గ్రుమ్మరింపుమా శక్తి ||పరి||

4వ చరణం

4.  వాక్యమందలి భావముల్ లోతుగ దరచి వచియింప దరమె మాకు వాక్యోప దేశివిగా వచ్చి మాలో నిలచి వాక్యమందలి జీవ భావాలు దెలుపుమా ||పరి||

5వ చరణం

5.  సాధక బాధకముల నిలయంబైన సంసార సాంద్రములో ఆదరణ కర్తవుగా నరుదెంచి మా సర్వ బాధల దొలగించి మోదంబు గూర్చుమా ||పరి||