TG-4988
Telugu

చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ

Cheediyalu Gunpugoodiri Kreesthu Jaadan

0
views
పల్లవి

చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని తాల్మి నీడిరి ఆడికలనోర్చి నేఁడు మన పాఁలి వాఁడుసిలువ ను న్నాడు గదె యంచు ||చేడియలు||

1వ చరణం

1.  వారి మొగములు వాడెను యేసు వారి వెత లెల్ల జూడను నీరు దృక్సర సీరుహములందు జార తమ కొన గోరులను మీటి ||చేడియలు||

2వ చరణం

2.  రొమ్ములను జేతు లుంచుచు చింత గ్రమ్మి నిట్టూర్పు లిచ్చుచు కొమ్మలట నిల్పు బొమ్మలన చేష్ట లిమ్ముచెడి యబ్బు రమ్ముతో నిల్చి ||చేడియలు||