TG-499
Telugu

రవికాంతిని మించినదౌ ఒక దేశము

ravikaanthini minchinadau oka deeshamu

202
views
పల్లవి

రవికాంతిని మించినదౌ ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి యాశ్రయ మిచ్చునటన్ ||రవికాంతిని మించినదౌ||

1వ చరణం

దుఃఖబాధలు లేక సదా పూర్ణశాంతినిఁ బొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందు నెప్పుడు బాడుదుము. ||రవికాంతిని మించినదౌ||

2వ చరణం

ప్రేమ సాగరుఃడౌ జనకున్ మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత జూపుచును నిత్యమున్ స్తుతి యించెదము ||రవికాంతిని మించినదౌ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.