TG-4093
Telugu

పిల్లలారా నా మాట వినుడి

Pillalaaraa Naa Maat Vinudi

0
views
పల్లవి

పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను – (2) ||పిల్లలారా||

1వ చరణం

బ్రతుక గోరువాడెవడైన కలడా? (2) మేలునొందుచు చాలా దినములు (2) ||పిల్లలారా||

2వ చరణం

కపటమైన చెడు మాటలాడక (2) కాచుకొనుము నీదు పెదవులను (2) ||పిల్లలారా||

3వ చరణం

కీడు మాని మేలునే చేయుము (2) సమాధానము వెదకి వెంటాడు (2) ||పిల్లలారా||

4వ చరణం

యెహోవా దృష్టి నీతిమంతులపై (2) కలదు వారి మొఱల వినును (2) ||పిల్లలారా||

5వ చరణం

దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి (2) కొట్టివేయు తన సన్నిధి నుండి (2) ||పిల్లలారా||

6వ చరణం

నీతిమంతులు మొఱ పెట్టగా (2) విని శ్రమల నుండి తప్పించును (2) ||పిల్లలారా||

7వ చరణం

విరిగినట్టి హృదయములకు (2) యెహోవా ఆసన్నుడై యున్నాడు (2) ||పిల్లలారా||

8వ చరణం

నలిగియున్న వారల నెల్ల (2) ఆయనే రక్షించు ప్రేమగల్గి (2) ||పిల్లలారా||