TG-043
Telugu

శ్రీ యేసు కర్తను సేవఁ

shree yeesu karthanu seevam

208
views
పల్లవి

శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను శ్రేయముల నెఱింగి నీకు రేయిపవ లొసంగి యెడఁ బాయని యంతరంగి యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ ||శ్రీ యేసు||

1వ చరణం

నిదురయందు నేఁడు క్షేమ మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ మాయెఁజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||

2వ చరణం

అంధకార మణఁగెన్ హృదయాంధకార మణఁగెన్ ప్రభు నందుఁ దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగఁ గూర్చి ||శ్రీ యేసు||

3వ చరణం

కంటిపాప వలెను నిను గాయువాని దయను గనుఁ గొంటివి స్తోత్రమును జేయు మింటి కినిమంటికన్నింటికిని కర్తయని ||శ్రీ యేసు||

4వ చరణం

కలకల ధ్వనిఁజేయు పక్కిగములు లయను గూయు సర్వములు ప్రభు స్తుతిఁజేయు నీ వలయక సొలయక వెలయఁగఁ బాడు ||శ్రీ యేసు||

5వ చరణం

సేవయందు నీకు మంచి యీవు లిడుపరాకు గల భావముఁబడఁ బోకు నేడుఁ కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||

6వ చరణం

పగటివార మంచు నిష్ఫ్లపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు పురికెగయ నీ దిగులు విడు తగు నమ్మకమున ||శ్రీ యేసు||

7వ చరణం

మింటి నంటఁ బాడు నీ యొంటి బలిమి నేఁడు ప్రభు నంటి యుండ వాఁడు నిన్నొంటి నెన్నంటి కెన్నింటికిన్వీడఁడు ||శ్రీ యేసు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.