TG-042
Telugu

తెల్లవారిన వేళఁ దెలి వొంది

thellavaarina veellam deli vondi

206
views
పల్లవి

తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||తెల్లవారిన వేళఁ||

1వ చరణం

నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును ||తెల్లవారిన వేళఁ||

2వ చరణం

భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్ ||తెల్లవారిన వేళఁ||

3వ చరణం

దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్ ||తెల్లవారిన వేళఁ||

4వ చరణం

పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్ ||తెల్లవారిన వేళఁ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.