వినవే నా వినతి నివేదన

vinavee naa vinathi niveedana

🎵 TG-049💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా ||వినవే నా||

1వ చరణం

నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను ||వినవే నా||

2వ చరణం

నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా ||వినవే నా||

3వ చరణం

ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేవగలు ||వినవే నా||

4వ చరణం

పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ ||వినవే నా||

5వ చరణం

నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు ||వినవే నా||

Report Error